పోలీస్ నియామకాల్లో అక్రమాలకూ పాల్పడిన ఐదుగురు అరెస్ట్

క్వాలిఫై కాని వారిని క్వాలిఫై చేస్తాం అని 2 లక్షలు డిమాండ్

2ed
2ed

పోలీస్ నియామక ప్రక్రియలో అక్రమాలకు ప్రయత్నించిన ఇద్దరు ఉద్యోగులతో పాటు ముగ్గురు అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

పరీక్షలో అర్హత పొందని వారిని కూడా అర్హత సాధించే విధంగా చేస్తానని చెప్పి ముగ్గురు అభ్యర్థుల నుండి సుమారు రెండు లక్షల వరకు ఏజెంట్లు తీసుకోవడం జరిగింది.

పోలీసు నియామక ప్రక్రియలో కొలతలు మరియు మిగిలిన ఈవెంట్స్ కు సంబంధించిన రికార్డింగ్ బాధ్యతను TSLPRB ఈ సాఫ్ట్ అనే సంస్థకు అప్పగించడం జరిగింది.

ఇందులో ఉద్యోగి అయిన నాగు అనే వ్యక్తి తన తమ్ముడు రమేష్ ను ఏజెంట్ గా పెట్టుకొని ఈవెంట్స్లో క్వాలిఫై కానీ అభ్యర్థులను పాస్ చేయించేందుకు వారి దగ్గర డబ్బులు వసూలు చేశాడు.

ఈ విధంగా కొండాపూర్ మరియు అంబర్పేట్ కు చెందిన గ్రౌండ్ లో నుంచి ముగ్గురు అభ్యర్థుల నుంచి దాదాపు రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు.

ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఇన్స్పెక్షన్ లో ఈ విషయం బయటపడింది వెంటనే TSLPRB అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఐదుగురి అరెస్ట్ చేయడం జరిగింది.

ఈ విషయంపై TSLPRB చైర్మన్ మాట్లాడుతూ పోలీసు నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగవని నియామకాలను పారదర్శకంగా జరుగుతున్నాయని ఎవరికీ డబ్బులు ఇవ్వదు ఇచ్చి మోసపోవద్దు అని చెప్పి పేర్కొనడం జరిగింది.

  • Posts not found

Leave a Reply

Your email address will not be published.