Indian Constitution Important bits Download PDF

Indian Constitution Important bits Download PDF for Free

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొన్ని ముక్యమయిన ప్రశ్నలు PDF డౌన్లోడ్ చేసుకోవాలి అనుకొనే వారు కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Click here to download PDF

పోటీ పరీక్షల మెటీరియల్ మరియు ప్రిపరేషన్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేసి YouTube ఛానల్ visit చేయండి

 

  1. రాజ్యాంగ పరిషత్తు ఎవరి సిఫారసుతో ఏర్పడింది?

జ. కేబినెట్ మిషన్ ప్లాన్

 

  1. రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు?

జ. సచ్చిదానంద సిన్హా

 

  1. రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడు ఎవరు?

జ. డాక్టర్ రాజేంద్రప్రసాద్

 

  1. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?

జ. 1946 డిసెంబర్ 9

 

  1. రాజ్యాంగ పరిషత్ లో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య ఎంత?

జ. 15 మంది

 

  1. రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?

జ. జే. బీ. కృపలానీ

 

  1. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసినప్పుడు బ్రిటీష్ గవర్నర్ జనరల్?

జ. లార్డ్ వేవెల్

 

  1. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు ఎవరు?

జ. హెచ్. సి. ముఖర్జీ & కృష్ణమాచారి

 

  1. రాజ్యాంగ పరిషత్ కు న్యాయ సలహాదారు ఎవరు?

జ. బి. ఎన్. రావు

 

 

  1. రాజ్యాంగ రచనా సంఘానికి/ ముసాయిదా సంఘానికి అధ్యక్షుడు ఎవరు?

జ. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్

 

 

  1. రాజ్యాంగ రచనా సంఘం ఎప్పుడు ఏర్పాటయింది?

జ. 1947 ఆగస్టు 29

 

 

  1. రాజ్యాంగ రచనా సంఘం లో ఎంత మంది సభ్యులు ఉన్నారు?

జ. ఆరుగురు

 

  1. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది?

జ. 1949 నవంబర్ 26

 

  1. రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత?

జ. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు

 

  1. రాజ్యాంగ పరిషత్తు చిహ్నం ఏది?

జ. ఏనుగు

 

  1. భారత రాజ్యాంగం ప్రకారం అధికారానికి మూలం ఎవరు?

జ. ప్రజలు

 

  1. రాజ్యాంగం యొక్క లక్ష్యాలకి ఆదర్శాలకు ప్రతిభ ఏమిటి?

జ. రాజ్యాంగ ప్రవేశిక

 

  1. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ పదాలతో ప్రారంభమవుతుంది?

జ. “భారత దేశ ప్రజలమైన మేము…..”

 

  1. రాజ్యాంగ ప్రవేశిక ఇప్పటికి ఎన్ని సార్లు సవరించారు?

జ. ఒకసారి 1976లో

 

  1. సామ్యవాదం లౌకికవాదం అనే పదాలు ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?

జ. 42వ సవరణ

 

  1. రాజ్యాంగ పరిషత్ లో మొత్తం సభ్యులు ఎంతమంది?

జ. 299( దేశవిభజన తర్వాత)

 

 

  1. భారత రాజ్యాంగ తొలి ప్రతిని ఇక్కడ ప్రచురించారు?

జ. డెహ్రాడూన్ లో

 

  1. రాజ్యాంగ పరిషత్తు చీఫ్ డ్రాఫ్ట్స్ మన్ ఎవరు?

జ. ఎస్. ఎన్ . ముఖర్జీ

 

  1. భారత రాజ్యాంగం లోని చాలా విషయాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు?

జ. భారత ప్రభుత్వ చట్టం, 1935.

 

  1. పార్లమెంటరీ ప్రభుత్వం భావనను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు?

జ. బ్రిటన్/ ఇంగ్లాండ్

 

  1. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏ రాజ్యాంగం స్వీకరించారు?

జ. ఐర్లాండ్

 

  1. ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష- ఈ అంశాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?

జ. అమెరికా

 

  1. సమాఖ్య వ్యవస్థను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?

జ. కెనడా

 

  1. ఉమ్మడి జాబితా, ఉభయ సభల సంయుక్త సమావేశం- ఈ అంశాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు?

జ. ఆస్ట్రేలియా

 

  1. ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?

జ. యు.ఎస్.ఎస్.ఆర్. / రష్యా

 

  1. స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే భావనలను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?

జ. ఫ్రాన్స్

 

  1. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దు అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?

జ. జర్మనీ

 

  1. రాజ్యసభ సభ్యుల ఎన్నిక రాజ్యాంగ సవరణ విధానం ఏ దేశం నుంచి గ్రహించారు?

జ. దక్షిణాఫ్రికా

 

 

 

  1. న్యాయ సూత్రాలు అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?

జ. జపాన్

 

  1. మత ప్రమేయం లేని భావన ఏది?

జ. లౌకికవాదం

 

  1. భారత రాజ్యాంగ అసలు ప్రతిని ఆంగ్లంలో దస్తూరితో రాసిందెవరు?

జ. ప్రేమ్ బెహారీ నారాయణ్ రైజదా

 

  1. రాజ్యాంగ పరిషత్ కు గాంధీజీ ఏ ప్రాంతం నుంచి ఎన్నికయ్యారు?

జ. గాంధీజీ అందులో సభ్యుడు కాదు.

 

  1. భారత రాజ్యాంగ నిర్మాత అని ఎవరికి పేరు?

జ. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్

 

  1. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఏది?

జ. 1950 జనవరి 26

 

  1. భారత రాజ్యాంగం యొక్క అసలు మూల ప్రతులు ఎక్కడ భద్రపరచబడినాయి?

జ. న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్ లోని గ్రంథాలయంలో.

 

  1. రాజ్యాంగ పరిషత్ లో ఏ పార్టీకి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు ?

జ. కాంగ్రెస్

 

  1. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్స్, షెడ్యూళ్ల సంఖ్య ఎంత?

జ. 395 అధికరణాలు, 8 షెడ్యూళ్లు

 

  1. మన దేశానికి స్వాతంత్రం వచ్చినాక ఎన్ని రోజులకి రాజ్యాంగ ముసాయిదా సంఘం ఏర్పాటు చేశారు?

జ. 14 రోజులు

 

  1. మన రాజ్యాంగం తొలిసారి ఎప్పుడు సవరించారు?

జ. 1951లో

 

  1. భారత రాజ్యాంగం ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు?

జ. 103 సార్లు

 

 

  1. మొదటి రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?

జ. భూసంస్కరణలు& భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు

 

  1. 103 వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది?

జ. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసి లకు) విద్య, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పన.

 

  1. ప్రస్తుతం ప్రాథమిక హక్కులు ఎన్ని?

జ. 6

 

  1. ప్రస్తుతం రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఉన్నాయి?

జ. 11

 

  1. ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 1976లో తొలగించబడిన హక్కు?

జ. ఆస్తి హక్కు

 

  1. గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ బద్ధత కల్పించిన సవరణ ఎన్నవది?

జ. 73వ

  1. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కుదరదు అని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది?

జ. కేశవానంద భారతి కేసు

 

  1. అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ అధికరణ ఏది?

జ. 17వది

 

  1. ఒక దేశాధినేత వారసత్వంగా కాక ప్రజలచే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఎన్నుకోబడే రాజ్యాన్ని ఏమంటారు?

జ. గణతంత్రం లేదా రిపబ్లిక్

 

  1. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం దేశానికి ఉంది?

జ. భారత్

 

  1. ప్రస్తుత మన రాజ్యాంగం లో ఉన్న అధికరణలు, షెడ్యూళ్ల సంఖ్య?

జ. 448 అధికరణలు, 12 షెడ్యూళ్ళు

 

  1. భారత రాజ్యాంగ అసలు ప్రతులకు బొమ్మలు గీసిన చిత్ర కారుల బృంద నాయకుడు?

జ. నందలాల్ బోస్ (శాంతినికేతన్)

 

  1. రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ అని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ దేని గురించి చెప్పారు?

జ. రాజ్యాంగ ప్రవేశిక

 

 

  1. భారత రాజ్యాంగ అసలు ప్రతిలో ప్రవేశిక పేజీని రూపొందించింది ఎవరు?

జ. రామ్ మనోహర్ సిన్హా

 

  1. జీవించే హక్కు రాజ్యాంగం నుండి అధికరణలో ఉంది?

జ. 21వ

 

  1. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం?

జ. 2015 సం. నుంచి

 

  1. భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన తెలుగు మహిళ?

జ. దుర్గాబాయి దేశముఖ్

 

  1. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గధామంగా పేర్కొన్నది ఎవరు?

జ. ఐవర్ జెన్నింగ్స్

 

ఈ PDF షేర్ చేసి నిరుద్యోగులకు మీ వంతు సహాయం అందించండి

వీడియో క్లాసెస్ మరియు మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేసి మన ఛానల్ Visit చేయండి.

Shiva Online Study

Telegram Group https://t.me/competitive_study

Shiva Online Study

Leave a Reply

Your email address will not be published.