TSLPRB Must fallow diet for events

TSLPRB Diet plan for 800 and 100 meter runing,long jump,high jump,short put.

in tslprb police recruitment events are the most important stage to get job. in this way candidates have to practice well and put more effort on it.

Eating healthy food and maintaining good diet also very important for Telangana State level police recruitment

in this article we are explaining time to time diet plan in Telugu and important nutrition food fallow this diet plan for 30 to 40 days.

Definitely your SI and PC 800 and 100 meter running will show you good results.

7 important diet plan tips for Telangana SI PC Police events.

READ: Breething improvement food running time Telugu explanation.

District wise PC events Schedule.

Telugu Explanation Below.

SI PC ఈవెంట్స్ డైట్ ప్లాన్ఏవి తినాలి ? ఏ సమయం లో తినాలి ?

పోలీస్ ఈవెంట్స్ లో ఎంతో శారీరక శ్రమ అవసరం, దీనికోసం ప్రతి రోజు మనం ఎన్నో కాలరీల శక్తి ఖర్చుచేస్తుంటాం.

చాలా మంది అభ్యర్థులు చేసే చిన్న పొరపాటు ఏంటంటే వాళ్ళు ఖర్చు చేసిన శక్తికి సమాన స్థాయిలో తిరిగి శరీరానికి అందివ్వరు.దీని వళ్ళ అనారోగ్యం లేదా రన్నింగ్ కెపాసిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

దిన్ని కొంత వివరంగా చెప్పాలంటే ఉదాహరణకు ఒక్క రిజర్వాయర్ లో నీళ్ళు నిలువ ఉన్నప్పుడు వాటిని గేటు లనుండి వదిలేయాలి.మళ్ళి రిజర్వాయర్ లోకి నీరు వచ్చిన తర్వాత మల్లి నీటిని వదిలేయాలి.. ఈ విధంగా ప్రతి సారి రిజర్వాయర్ లో నీరు ఉంటేనే దానికి సమానస్థాయి లో నీరు వదలాలి.

ఇందుకు విరుద్ధంగా రిజర్వాయర్ వెనుక నిల్లు లేకున్నా వదులుతూ పోతే రిజర్వాయర్ మొత్తం ఎండిపోతుంది.

అదే విధంగా మనం కూడా శరీరానికి కావలసినంత శక్తిని అందిస్తూ దాన్ని ఖర్చు చేయాలి అలా చేసినప్పుడే శరీరం సమర్ధవంతంగా ఈవెంట్స్ కోసం సన్నధం అవ్వగలుగుతుంది.

దీనికోసం మనం శరీరానికి శక్తినిచ్చె ఆహారపదార్థాలు తినడం ఎంతో అవసరం.

శక్తి వర్తకమైన ఆహార పదార్థాలు మరియు వాటిని ఏ సమయం లో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1)  ఉదయం లేవగానే రన్నింగ్ వెళ్ళే ముందు మనం ఇంతకు ముందు ఆర్టికల్ లో చెప్పుకున్నట్టు మొలకెత్తిన విత్తనాలు తిని వెళ్ళాలి.

 

2) రన్నింగ్ వెళ్లి వచ్చిన తరువాత ముందు రోజు రాత్రి నానబెట్టిన ఎండు కర్జూర పండ్లను 4 లేదా 5 తినాలి.(పచ్చి కర్జూర కన్నా ఎండు కర్జూర ఎక్కువ మేలు చేస్తుంది.)

* 2 ఉడకపెట్టిన కోడి గుడ్లు తినాలి (నీలం ఇష్టం లేని వాళ్ళు రోజుకు కనీసం ఒక్కదాని నీలం అయినా తింటే మంచిది)

* దీనితో పాటు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి బాదం పప్పు 4 , జీడి పప్పు 4

* ప్రతి రోజు గ్లాస్ పాలు పాలు తాగాలి.

పాలు శరీరం లో కాల్షియం శాతం పెంచి ఎముకలు ధృడంగా అవ్వడానికి తోడ్పడుతుంది. ఎముకలు గట్టిగ లేకుంటే శిన్ బోన్,కీళ్లలో జాయింట్ నొప్పులు వస్తాయి.

 

3) ఇవి తిన్న 30 నిమిషాల తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.(బ్రేక్ ఫాస్ట్ లో నూనె ఎక్కువ ఉండేవి ఈవెంట్స్ అయ్యే వరకు కొంత తగ్గించండి)

 

4) ఉదయం 11 నుండి 12 గంటల మద్య 2 అరటి పండ్లు లేదా బలవర్థకమైన ఫలాలు ఎవైన తీసుకోవాలి.

 

5) మద్యాహ్నం భోజనం లో అన్నం తీసుకోవాలి.వారం లో 3 సార్లు మాంసాహారం (చికెన్,మటన్,చాపలు) తీసుకోవడానికి ప్రయత్నిద్దాం.

గమనిక: మాంసాహారంలో నూనె శాతం చాల తక్కువ ఉండేలా వండుకోవాలి.

 

6) రాత్రికి డిన్నర్ లో లైట్ ఫుడ్ తీసుకోండి చపాతి లేదా అన్నం ఏదైనా తినొచ్చు.(రాత్రి నాన్ వెజ్ తినకండి అది త్వరగా జీర్ణం కాదు కాబట్టి ఉదయం రన్నింగ్ లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.)

 

7) రాత్రి పడుకోవడానికి 20 లేదా 30 నిమిషాల ముందు మల్లి రెండు ఉడికించిన గుడ్లు మరియు గ్లాస్ పాలు తాగి పడుకోండి.

 

ఇలా ఈవెంట్స్ అయ్యే వరకు ఈ డైట్ పాటిస్తే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి.

 

ఉద్యోగం కోసం కోచింగ్ లలో ఎంతో ఖర్చు చేసి ఉంటాం. ఈ 30 రోజులు దీనికి 3000 వరకు ఖర్చు కావచ్చు కానీ ఈవెంట్స్ లో మీ ప్రతిభను పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

మా యొక్క Official APP డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సమాచారం మీకు ఉపయోగకరం అనిపిస్తే share చేసి మిత్రులకు సహాయపడుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *